Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యుఎస్‌లో 'ఖైదీ నంబర్‌ 150' కలెక్షన్ల సునామీ.. "బాహుబలి - పీకే" చిత్రాలను బీట్ చేసిందా?

గురువారం, 12 జనవరి 2017 (11:56 IST)

Widgets Magazine

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. ఆయన నటించిన గత చిత్రాలకు భిన్నంగా 'ఖైదీ నంబర్ 150' కనకవర్షం కురిపిస్తోందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.
 
చాలా ఏళ్ల తర్వాత చిరు వెండితెరపై కనిపించిన ఈ చిత్రం అమెరికాలో తొలిరోజున 1,251,548 డాలర్లు (రూ.8.56 కోట్లు) రాబట్టిందని ట్వీట్‌ చేశారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటించారు. 
 
కాగా, ఖైదీ చిత్రం తొలి రోజున యుఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫలితంగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి', అమీర్ ఖాన్ 'పీకే' చిత్రాలను బీట్ చేసి ఏకంగా దాదాపుగా 1.50 మిలియన్ డాలర్లను రాబట్టుకుంది. ఫలితంగా బాహుబలి, పీకే చిత్రాలు రికార్డులు గల్లంతయ్యాయి. ఈ రెండు చిత్రాలే కాకుండా ఏ ఒక్క భారతీయ మూవీ కూడా ప్రీమియర్ షోల ద్వారా 1.50 మిలియన్ డాలర్లను ఇప్పటివరకు రాబట్టలేదు Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

‘ఖైదీ నెంబర్‌ 150’ సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన 'కత్తి' మురుగదాస్

తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ...

news

మా మావయ్య ఇరగదీశాడు... 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై నారా లోకేష్ ట్వీట్

సినీ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం గురువారం ప్రపంచ ...

news

మెగా బ్రదర్ నాగబాబుకు థ్యాంక్స్ చెపుతున్న బాలకృష్ణ అభిమానులు.. ఎందుకంటే?

మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ధన్యవాదాలు చెపుతున్నారు. గుంటూరు వేదికగా ...

news

'బాలయ్యా... మీరే ఆదర్శ'మన్న సాయి ధరమ్ తేజ్... హ్యాట్సాఫ్ అన్న మంచు మనోజ్

నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ...

Widgets Magazine