శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (19:11 IST)

దీపావళికి 'ఖిలాడి' టైటిల్ సాంగ్: ప్లే స్మార్ట్ అంటోన్న మాస్ మహారాజా!

Khilladi
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'ఖిలాడి'. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. 
 
జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
 
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసిన చిత్రయూనిట్ మాస్ మహారాజ్ అభిమానుల కోసం దీపావళి కానుక సిద్ధం చేసింది. నవంబర్ 4వ తేదీన దీపావళి కానుకగా చిత్రంలోని సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ విషయాన్ని రవితేజ తన ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అని ఆలోచింపజేసే పాత్రల సమ్మేళనమే ఈ 'ఖిలాడీ' మూవీ అంటున్నారు మేకర్స్.