సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"ఖుదీరామ్ బోస్" మోషన్ పోస్టర్ రిలీజ్

khudirambose
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం స్వాతంత్ర్యం కోసం పిన్న వయసులోనే ప్రాణాలర్పించిన వీరుడుగా "ఖుదీరామ్ బోస్‌"గా ఉన్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఐదో భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ను ఆదివారం విడుదల చేశారు. 
 
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీనటులుగా విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. 
 
పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. భారత స్వాతంత్ర్యం కోసం అత్యంత పిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన వీరుడిగా ఖుదీరామ్ చరిత్రకెక్కాడు. 
 
గత 1889లో జన్మించిన ఖుదీరామ్.. ముజఫర్‌పూర్ కుట్ర కేసులో దోషిగా తేల్చిన బ్రిటిషర్లు.. 1908లో ఆయనకు మరణశిక్ష విధించారు. ఈ కేసు విచార‌ణ‌లో జ‌రిగిన కుట్ర‌, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లు యూనిట్ తెలిపింది.