గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (18:14 IST)

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

KA 10 poster
KA 10 poster
ఈ దీపావళికి "క" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. "కెఎ10" అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ సమర్పణలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ సంస్థ నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు యుడ్లీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రోజు "కెఎ10" సినిమా నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
 
కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ "క" టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో ఆయన తన కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. "క" సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా "కెఎ10" పై భారీ అంచనాలు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా "కెఎ 10" ఉండబోతోంది.