గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:51 IST)

కీర్తి సురేష్ మ్యూజిక‌ల్ వీడియో గాంధారి విడుద‌ల‌

Keerthi Suresh, Pawan CH, Ananya Bhatt, Brinda
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ న‌టించిన మొట్ట మొద‌టి తెలుగు పాప్  సాంగ్ ‘గాంధారి’. సోనీ మ్యూజిక్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, ది రూట్ అసోషియేష‌న్‌లో ఈ సాంగ్ రూపొందింది. సోమ‌వారం గాంధారి మ్యూజిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. కీర్తి సురేష్ అద్భుత‌మైన డాన్స్ మూమెంట్స్ చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేశాయి. డైరెక్ట‌ర్‌, కొరియో గ్రాఫ‌ర్ బృంద మాస్ట‌ర్, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ప‌వ‌న్ సి.హెచ్‌, పాట‌ల ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌, సింగ‌ర్ అన‌న్య భ‌ట్ ‘గాంధారి’మ్యూజికల్ వీడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ‘గాంధారి’ పోస్ట‌ర్‌ను కీర్తి సురేష్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్ంగా.. 
 
రూట్ ప్ర‌తినిధి ఐశ్వ‌ర్య మాట్లాడుతూ ‘‘కీర్తి సురేష్, బృంద‌గారితో క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా గొప్ప‌గా ఉంది. కీర్తి సురేష్ వంటి అమేజింగ్ యాక్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. బృంద‌గ మాస్ట‌ర్‌గారు వారి అమూల్య‌మైన స‌మ‌యాన్ని వెచ్చింది ఈ ప్రాజెక్ట్ చేశారు. ద‌క్షిణాదిన ఓ కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు. సోనీ మ్యూజిక్ వారికి ధ‌న్య‌వాదాలు. ఎక్స‌లెంట్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాం’’ అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సి.హెచ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సోనీ మ్యూజిక్‌, రూట్ సంస్థ‌కు కృత‌జ్ఞ‌త‌లు. కీర్తి సురేష్‌గారు, బృంద‌గారు ఓ అద్భుత‌మైన సాంగ్‌ను ఇచ్చారు. ముఖ్యంగా కీర్తి సురేష్‌గారు పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ ఓ సాంగ్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత మందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది. నాకు స‌పోర్ట్ చేసిన టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
కొరియోగ్రాఫర్, డైరెక్ట‌ర్ బృంద మాస్ట‌ర్ మాట్లాడుతూ ‘‘మాట్లాడటం కంటే, నాకు డాన్స్ చేయడం, చేయించడమే కష్టమైన పని. తొలిసారి తెలుగు వీడియో ఆల్బమ్‌కు కొరియోగ్ర‌ఫీ చేస్తూ డాన్స్ చేయడం ఇదే తొలిసారి. కీర్తి సురేష్ రియ‌ల్లీ సూప‌ర్బ్ డాన్స‌ర్‌. త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. త‌ను మ్యూజిక్ ఆల్బ‌మ్ చేయ‌డానికి ఒప్పుకోవ‌డం గొప్ప విష‌యం. త‌ను ఓ రోజు మాత్ర‌మే రిహార్స‌ల్ చేసింది. త‌న‌లాంటి క‌మిట్‌మెంట్ ఉన్న న‌టి అరుదు. రెండు రోజుల్లో ఈ పాట‌ను షూట్ చేశాం. సింపుల్‌గా ఓ ప‌దంలో చెప్పాలంటే త‌న డాన్స్‌తో సాంగ్‌ను చింపేసింది. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట్‌గా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 
 
కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘‘‘గాంధారి’ లాంటి మ్యూజికల్ వీడియోలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి నాకు కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా అనిపించింది. రూట్, సోనీ మ్యూజిక్‌కి థాంక్స్. సారంగ ద‌రియా త‌ర్వాత గాంధారితో వ‌ప‌న్ మ‌రో హిట్ అందుకున్నారు. సుద్దాల‌గారు అద్భుతంగా పాట రాశారు. బృంద‌గారితో, నేను ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న్ప‌పుడు వ‌ర్క్ చేశాను. అలాగే ఆమె కొరియోగ్ర‌ఫీలో వ‌ర్క్ చేశాను. అలాగే ఆమె డైరెక్ష‌న్‌లోనూ ప‌నిచేయ‌డం కొత్త అనుభూతినిచ్చింది.రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ చేశాం.  ఈ ఆల్బ‌మ్‌లో భాగ‌మైన టెక్నిక‌ల్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.