గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 15 జులై 2021 (15:49 IST)

కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా సినిమా ప్రారంభం

Divya-kiran
లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కబోతుంది. జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.
 
ఈ సినిమాకు `సమ్మతమే’ అనే పేరుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. `రాజావారు రాణిగారు’చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ తాజాగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా కూడా ఆయ‌న చేయ బోతున్నారు.