గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (17:14 IST)

కొండ మీ కోసం బాలీవుడ్‌లో కాలుపెడుతున్నాడు

Konda,  Ananya
Konda, Ananya
కొండ మీ కోసం బాలీవుడ్‌లో కాలుపెడుతున్నాడు. మీ అంద‌రినీ మెచ్చే సినిమా అవుతుంది అంటూ.. విజ‌య్ దేవర కొండ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తాజాగా త‌న సినిమా లైగ‌ర్ ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న రెండ‌వ రోజు బరోడాలో ప్రారంభమయింది. అక్క‌డ  ప్రెస్ ఇంటరాక్షన్ జ‌రిగింది. అంత‌కుముందు లంచ్‌లో భాగంగా ఓ హోట‌ల్‌లో తాను, అన‌న్య తింటున్న ప‌దార్థాల‌ను కూడా పోస్ట్ చేశాడు. విశాల‌మైన ప‌ల్లెంలో అన్ని వంట‌కాలు వున్న ప్లేట్‌ను చూపిస్తున్నాడు.
 
Konda,  Ananya
Konda, Ananya
ఈ రోజు మధ్యాహ్నం అక్క‌డి పరుల్ విశ్వవిద్యాలయంలో లైగ‌ర్ బృందం పాల్గొంది. బాలీవుడ్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను కొండా అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ వుంటారు. క‌ర‌న్ జోహార్ ఈ పేరు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఎన‌ర్జిటింగ్‌, ఎట్రాక్టివ్ హీరోగా ఆయ‌న సంబోధించారు. ఇక పూరీ జ‌గ‌న్నాథ్ మాత్రం పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా చెప్పేస్తున్నారు. మ‌రి ఈనెల 25న విడుద‌ల‌కానున్న లైగ‌ర్ సినిమా విడుద‌ల త‌ర్వాత పూరీ ఎటువంటి సినిమా తీశాడో అర్థ‌మైపోతుంది.