శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 23 జులై 2015 (15:08 IST)

ప్రధానికి, ఇద్దరు సీఎంలకు శ్రీమంతుడు చూపించాలనుకోలేదు... కొరటాల

ఇటీవలే శ్రీమంతుడు చిత్రాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఆ తర్వాత ప్రధాని మోడీకి ప్రత్యేకంగా షో వేసి చూపించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇస్తున్నాడు. ప్రధానికి, ఇద్దరు సిఎం.లకు మేం షో వేయాలని ఇంకా అనుకోలేదు.
 
ఈ సినిమా థ్రెడ్ గురించి చెపుతూ‌... ఒక ఎన్‌ఆర్‌ఐ వచ్చి ఇక్కడ గ్రామాన్ని దత్తత తీసుకోవడం.. ఆ తర్వాత ఇదే పాయింట్‌ను మోడీగారు.. ఎం.పి.లకు వ్యాపారవేత్తలకు సూచిస్తుండేవారు. అందుకే ఈ పాయింట్‌ అందరికీ రీచ్‌ అయ్యేలా పలువురు రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు చూపించాలనుకున్నాం. మినహా వారికి చూపించాలనుకోలేదు. త్వరలో అధికారికంగా తెలియజేస్తామని చెప్పారు. కాగా, ఈ నెల 31తో సెన్సార్‌ పూర్తవుతుంది. ఆగస్టు 7న సినిమా విడుదల కానుంది.