మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (14:09 IST)

కొరటాల శివ దర్శకత్వంలో నాని..

శ్రీమంతుడు చిత్రంతో హిట్ కొట్టిన కొరటాల శివ.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వినోదంతో పాటు సందేశాత్మకంగా వుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం నాని 'కృష్

శ్రీమంతుడు చిత్రంతో హిట్ కొట్టిన కొరటాల శివ.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వినోదంతో పాటు సందేశాత్మకంగా వుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం నాని 'కృష్ణార్జునయుద్ధం' సినిమాలో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చిందని సమాచారం. 
 
మరోవైపు ''భరత్ అనే నేను'' సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చిందని టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే సినిమా పూర్తయ్యాక కొరటాల నానితో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 
 
యువ దర్శకులతో, కొత్త దర్శకులతో సినిమాలు చేసే నాని.. కథాబలంతో సినిమాలు చేసే కొరటాలతో సినిమా చేయడం ద్వారా సక్సెస్ ఫుల్ హీరో నుంచి అగ్ర హీరో స్థాయికి ఎదిగే అవకాశం వుందని సినీ పండితులు అంటున్నారు. స్టార్ హీరో స్టేటస్‌కి దగ్గరలో వున్న నానితో సినిమా చేసేందుకు కొరటాల శివ కూడా ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. కొరటాల స్నేహితులు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారని తెలిసింది