శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (17:05 IST)

ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

krishna
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఈ అంత్యక్రియలను పూర్తి చేశారు. అంతకుముందు పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. దారికి ఇరువైపులా నిలబడిన అభిమానులు తమ అభిమాన హీరోకు కన్నీటితో వీడ్కోలు పలికారు. 
 
మరోవైపు, మహాప్రస్థానంలో కృష్ణ కుటుంబ సభ్యులు కొద్ది మంది ప్రముఖులను మాత్రమే అనుమతించారు. అంత్యక్రియలను కూడా లీసుల గౌరవార్థం వరకు మాత్రమే లైవ్‌లో చూపించారు.  ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్‌ను నిలిపివేశారు. 
 
కాగా, సోమవారం వేకువజామున అనారోగ్యానికి గురైన కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడించారు. 
 
ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తదితరులు నివాళులు అర్పించారు.