శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (17:21 IST)

కృష్ణ వ్రింద విహారి' చాలా మంచి కంటెంట్ వున్న సినిమా

pre release krishna vinda
pre release krishna vinda
హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నాగశౌర్య,  షిర్లీ సెటియా వేదికపై ఏముందిరా పాటకు డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే షిర్లీ సెటియా తన పాటతో కూడా ఆకట్టుకున్నారు. చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, వివేక్ , దామోదర్ ప్రసాద్, హర్షిత్ రెడ్డి, దర్శకులు నందినీ రెడ్డి, బివిఎస్ రవి, మాజీ మంత్రి రఘువీర రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
 
హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘కృష్ణ వ్రింద విహారి' రెండున్నరేళ్ళ ప్రయాణం. కోవిడ్ కారణంగా చాలా సమస్యలు తలెత్తాయి. చాలా ఆర్ధిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాతలైన మా అమ్మనాన్న.. నా కోసం, సినిమా యూనిట్ కోసం చాలా ధైర్యంగా నిలబడి మంచి డేట్ కోసం ఎదురుచూసి సినిమాని ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి అమ్మనాన్న దొరకడం నా అదృష్టం. దర్శకుడు అనీష్‌ కృష్ణ మంచి మనసున్న దర్శకుడు. ఆయనతో చేసిన ప్రయాణంలో నేను చాలా మారాను. ఆయన జుట్టులానే ఆయన ఓపిక పెరుగుతూనే వుంటుంది. చాలా మంచి కథ చెప్పారు. అద్భుతంగా తీశారు. నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం వుంది. కెమరామెన్ సాయి శ్రీరామ్ గారు నాకు చాలా ఇష్టం. ఆయనతో ఇదివరకు సినిమాలు చేశాను. ఈ సినిమాకి ఆయన పని చేయడం నా అదృష్టం. చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం వుంది. సినిమా లైఫ్ ని నిర్ణయించే సన్నివేశం అది. ఆ ఒక్క సీన్ లక్ష్మీ భూపాల గారు అద్భుతంగా రాశారు. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మహతి సాగర్ సంగీత దర్శకుడు అనడం కంటే నా బెస్ట్ ఫ్రండ్ అనడం సబబు. ఇండస్ట్రీలో నా గురించి మొత్తం తెలిసిన వ్యక్తి సాగర్. నేను ఎలాంటి మూడ్ లో వున్న తనకి తెలిసిపోతుంటుంది. ఇందులో చాలా మంచిమ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారు పాటలని చాలా బ్యూటీఫుల్ గా కోరియోగ్రఫీ చేశారు. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించారు.
 
 శెర్లీ చాలా మంచి నటి. అందంగా పాడుతుంది కూడా. తనతో నటించడం ఆనందంగా వుంది. రాధిక గారు లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదు. ఈ సంగతి రాధిక గారికి కూడా చెప్పాను. ఆ పాత్ర రాధిక గారు కాకుండా ఎవరూ చేయలేరు. మా సినిమా చేసినందుకు రాధిక గారికి కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మజీ గారు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు.. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ.. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు. అనిల్ రావిపూడి అన్న క్లాప్ కొట్టినపుడు వచ్చారు. టీజర్ లాంచ్ కి వచ్చారు. ఇప్పుడు వచ్చారు. మాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఆయన మేలు మర్చిపోలేను. ఈ సినిమా కోసం పాదయాత్ర చేశాను. అన్ని ఊర్లు తిరిగాను. కంటెంట్ బావుంది కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడ్డాను. ఈ సినిమా చాలా బావుందని నిజాయితీగా నమ్ముతున్నాను. ఈ సినిమా చూడండి. హిట్టా, సూపర్ హిట్టా , బ్లాక్ బస్టరా, లేదా ఫ్లాప్ .. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటాను. సినిమా చాలా బావుందని మరోసారి చెబుతున్నాను. మీ నమ్మకం మాత్రం పోగొట్టుకోను. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆనందించాలి’’ అని కోరారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. ఈ టీం అంతా నాకు ఫ్యామిలీ లాంటింది. చాలా కష్టపడి చేశారు. ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలసి చూసి నవ్వుకునేలా కనిపించింది. దర్శకుడు అనిష్ లో నాకు బాగా నచ్చేది నవ్వు. ఎలాంటి పరిస్థితిలో కూడా నవ్వుతునే ఉంటాడు. నిర్మాత ఉషా, శంకర్ గారు నాకు బాగా కావాల్సిన వారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, మరిన్నీ మంచి మంచి సినిమాలు తీయాలి. షిర్లీ వెల్ కమ్ తో టు టాలీవుడ్. ఈ సినిమాలో పని చేసిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. శౌర్య హార్డ్ వర్కింగ్ హీరో. విభిన్నమైన జోనర్స్ లో ప్రయాణం చేస్తున్నారు. ఈ సినిమా శౌర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇలాంటి సినిమాలు శౌర్యకి బాగా నప్పుతాయి. ఇలాంటి సినిమాలు ఇంకా చేసి మంచి విజయాలు సాధించాలి. ఈ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేశారు. శౌర్య పాదయాత్ర ఆలోచనకు హాట్సప్. దానిని నిర్వహించిన పీఆర్ టీం వంశీ శేఖర్ .. అందరికీ నా బెస్ట్ విశేష్. సెప్టెంబర్ 23న సినిమాని అందరూ థియేటర్ లో ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు.
 
అనీష్‌ ఆర్‌ కృష్ణ మాట్లాడుతూ.. నాగశౌర్యకి కృతజ్ఞతలు. నేను కథ చెప్పిన వెంటనే కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి షూటింగ్ మొదలుపెట్టారు. సినిమా ఆయనకి నచ్చింది. బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే పాదయాత్ర చేసి ఊరూరా తిరుగుతున్నారు. సినిమాపై ఆయనకి వున్న నమ్మకం ప్రజల్లో కలిగించాలానే ఆలోచన నిజంగా అద్భుతం. ఐరా క్రియేషన్స్ ఉషా, శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ధైర్యంగా నిలబడటం వలనే సినిమా ఇంత  గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాధిక గారు ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. షిర్లీ తొలిసారి తెలుగులో నటించి ఆమె పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. బ్రహ్మజీ, వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, హిమజ వారి అనుభవంతో మా సినిమాకి మంచి బలాన్ని చేకూర్చారు. డీవోపీ సాయి శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు. సాగర్ మహతి ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఎడిటర్ తమ్మిరాజు గారి అనుభవం మాకు ఎంతో హెల్ప్ అయ్యింది. ఆర్ట్ డైరెక్టర్ రామ్ గారితో పని చేయడం మంచి అనుభవం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు. సెప్టెంబర్ 23న సినిమా చూసి ఎలా వుందో ప్రేక్షకులు చెప్పాలి’’ అని కోరారు.
 
మహతి స్వరసాగర్ మాట్లాడుతూ.. ఐరా క్రియేషన్స్ నా హోం బ్యానర్ లాంటింది. ఇక్కడ చాలా స్వేఛ్చతో పని చేస్తా. అనిష్ చాలా కూల్ డైరెక్టర్. షిర్లీ చాలా మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. శౌర్య ఈ సినిమా కోసం పెట్టిన హార్డ్ వర్క్ పెట్టారు. ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ మూవీ ఇది. మీరందరూ సినిమా థియేటర్లో చూడాలి’ అని కోరారు.
 
షిర్లీ సెటియా మాట్లాడుతూ.. కృష్ణ వ్రింద విహారి లో వ్రింద పాత్ర చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాతో.. తెలుగు, తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డాను. శౌర్య, అనిష్, ఉషా, శంకర్ గారికి కృతజ్ఞతలు. నాదో చిన్న విన్నపం. నా సినిమా కృష్ణ వ్రింద విహారి  దయచేసింది సెప్టెంబర్ 23న థియేటర్లో చూడండి.’ అని కోరారు
 
బ్రహ్మాజీ మాట్లాడుతూ.., కృష్ణ వ్రింద విహారి చాలా బావుంటుంది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. అనిష్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. నాగశౌర్యతో వర్క్ చేయడం ఆనందంగా వుంటుంది. నాగశౌర్య చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను.
 
లక్ష్మీ భూపాల మాట్లాడుతూ.. నాగశౌర్యకి కళ్యాణ వైభోగమే, ఓ బేబీ రాశాను. ఈ సినిమాని వాటిని దాటి పెద్ద హిట్ కావాలి. అనిష్ చాలా అద్భుతంగా సినిమా తీశాడు. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. నాగశౌర్య అద్భుతమైన మనిషి. చాలా ఎనర్జిటిక్ పర్శన్. నాగశౌర్యతో సినిమా అంటే సినిమాని ఎంజాయ్ చేస్తాం. టీజర్, ట్రైలర్ చూసినప్పడు సినిమాలో మంచి ఎనర్జీ వుందనిపించిది. టైటిల్ సాంగ్ నాకు చాలా నచ్చింది. ఐరా క్రియేషన్స్ కోసం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. శౌర్యకి తప్పకుండా ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఇస్తుంది’’ అన్నారు.
 
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. నాగశౌర్య అంకితభావంతో పని చేసే హీరో. శౌర్యకి ఉషా, శంకర్ లాంటి తల్లితండ్రులు దొరకడం అతని అదృష్టం. టీం అందరికీ అల్ ది బెస్ట్.
 
మాజీ మంత్రి రఘువీరా రెడ్డి మాట్లాడుతూ .. .. కృష్ణ వ్రింద విహారి ఈ దసరాకు మంచి విందుగా విహారంగా కావాలని కోరుకుంటున్నాను. శౌర్య చాలా స్మార్ట్ గా వున్నారు. నిర్మాతగా ఉషా గారికి మంచి విజయాలు రావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’  చెప్పారు
 
బివిఎస్ రవి మాట్లాడుతూ.. ఐరా క్రియేషన్స్ ఉషా, శంకర్ గారికి సినిమాలంటే ప్యాషన్.  ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. అనిష్ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. శౌర్య చాలా హార్డ్ వర్క్ చేసే హీరో. శౌర్య పాదయాత్ర తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా మంచి టీంతో కలసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
 
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కీలకమైన టైటిల్ సాంగ్ రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి చాలా పాజిటివ్ బజ్ వుంది. సెప్టెంబర్ 23న సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.