గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (09:18 IST)

హీరోహీరోయిన్లు కంఫర్టుగా ఉంటే ముద్దుసీన్లు బాగా వస్తాయి : ఉప్పెన భామ

హీరోహీరోయిన్లు బాగా కంఫర్టుగా ఉంటే ముద్దు సీన్లు బాగా రావడమే కాకుండా రక్తికట్టిస్తాయని "ఉప్పెన" భామ కృతిశెట్టి అభిప్రాయపడ్డారు. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బందిపడ్డారా అనే ప్రశ్నలకు ఆమె బోల్డ్‌గా బదులిచ్చారు. 
 
'ముద్దు సన్నివేశాలను చాలా మంది చులక భావంతో చూస్తారు. వాటిలో నటిస్తే హీరోయిన్ల కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే అపోహ ఉంది. లిప్‌లాక్ అనేది నటలో భాగమేనని నేను నమ్ముతాను. యాక్షన్ సీన్స్‌లానే బోల్డ్ సీన్స్‌లోను నటిస్తాను. 
 
ప్రత్యేకంగా చూడను. హీరో హీరోయిన్ల మధ్య కంఫర్ట్‌ను బట్టే ముద్దుసీన్లు బాగా వస్తాయి. రక్తికట్టిస్తాయి కూడా. కథలో లిప్‌లాక్ సన్నివేశాలకు ప్రాధాన్యం లేకపోతే నేను నటించే ప్రసక్తే లేదు' అని తేల్చి చెప్పారు. 
 
అలాగే, ఉప్పెన చిత్రం తర్వాత పల్లెటూరి అమ్మాయి పాత్ర కోసం చాలా మంది దర్శకనిర్మాతలు సంప్రదించారు. కానీ, ఒకే తరహా పాత్రలను  చూస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తాని భావించింది. అందుకే అలాంటి పాత్రలు చేయడానికి అంగీకరించలేదు అని కృతిశెట్టి వివరణ ఇచ్చారు.