ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (18:30 IST)

2025 ఆస్కార్‌ అవార్డు కోసం అమీర్ ఖాన్ మాజీ భార్య లాపతా లేడీస్

Laapataa Ladies
Laapataa Ladies
2025 ఆస్కార్‌ అవార్డుల వేడుక కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈసారి అమీర్ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వంలో వచ్చిన 'లాపతా లేడీస్'కు అవకాశం ఇచ్చారు. 
 
అమిర్‌ ఖాన్‌ నుంచి దూరం అయిన తర్వాత కిరణ్ రావు సినిమాలపై శ్రద్ద పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. కిరణ్ రావు ఓ ఇంటర్వ్యూలో అన్నట్టుగానే ఆస్కార్‌ అవార్డులకు లాపతా లేడీస్ అధికారికంగా ప్రవేశాన్ని దక్కించుకుంది. 
 
ఇప్పటికే ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో ప్రదర్శించారు. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ మెల్‌బోర్న్‌‌లోనూ ఈ సినిమాకు చోటుదక్కింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌‌కి ఎంపిక అయ్యింది.