సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Preeti
Last Updated : సోమవారం, 23 జులై 2018 (10:50 IST)

బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన మంచు లక్ష్మక్క...చివరిలో షాకిచ్చి అందరినీ ఏడిపించేసింది

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంచు లక్ష్మీ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడి సభ్యులందరితో పేరు పేరునా మాట్లాడి సలహాలు ఇస్తూ తమ సినిమా గురించి ప్రమోట్ చేసుక

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంచు లక్ష్మీ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడి సభ్యులందరితో పేరు పేరునా మాట్లాడి సలహాలు ఇస్తూ తమ సినిమా గురించి ప్రమోట్ చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో రామ్‌గా నటించినది మరెవరో కాదు హౌస్‌లో మన లవర్ బాయ్ సామ్రాట్. 
 
ఈ వారం ఎలిమినేషన్‌లో ప్రేమ జంట సామ్రాట్ మరియు తేజస్వి ఉన్న కారణంగా రసవత్తరంగా మారింది. తన నోటితో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో చెప్పలేనంటూ ఈ బాధ్యతను నాని లక్ష్మీకి అప్పగించారు. ఫైనల్‌గా తేజస్విని తీసుకుని ఇంటి నుండి బయటికి వచ్చింది లక్ష్మి. ఇంటి సభ్యులందరూ షాక్‌కి గురవ్వడంతో పాటుగా కన్నీటి పర్యంతమయ్యారు. 
 
ఇక సామ్రాట్‌ను ఓదార్చడం ఎవరి తరం లేదు. ఏ బాధ లేనట్లు హుషారుగా కనిపించినా తేజస్వి కూడా భావోద్వేగానికి లోనవుతూ ప్రేమలో పడినట్లు అందరి ముందు బాహాటంగా చెప్పేసింది. అంతే కాకుండా బయటకు వచ్చాక కలుద్దాం అని చెప్పి వీడ్కోలు పలికింది.