శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (20:07 IST)

బాడీ షేమింగ్‌కు గురయ్యాను.. లక్ష్మీ ప్రసన్న

manchu lakshmi
సామాన్యులకే కాదు.. స్టార్ కిడ్స్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉంటాయనీ మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న వెల్లడించారు. మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.
 
గత కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మీ ప్రసన్న తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి బయటపెట్టారు.తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తనని చాలామంది బాడీ షేమింగ్ చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
 
ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణుల గురించి పెద్ద ఎత్తున ఏజ్, బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈ విషయం గురించి మాట్లాడుతూ .. తన బాడీ కర్వ్డ్ షేప్ ఉండటం వల్ల చాలామంది తనని బాడీ షేమింగ్ చేశారంటూ తనకు ఎదురైన చేదు సంఘటనలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రసన్న చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.