శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (20:48 IST)

'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' ఎలా వస్తుందో చూస్తాం అంటున్న తమ్ముళ్లు... డోంట్ కేర్ అంటున్న వర్మ

వివాద‌స్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నంద‌మూరి తార‌క రామారావు జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌వేశించిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌ధ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన టీజ‌ర్, ట్రైల‌ర్ & సాంగ్స్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ వివాద‌స్ప‌ద చిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికితోడు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నే ఆస‌క్తి అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను ఏర్ప‌డింది.
 
ఇదిలావుంటే... ఈ సినిమాపై తెలుగు త‌మ్ముళ్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుండ‌టంతో ఈ మూవీ రిలీజ్ పైన అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే... వ‌ర్మ మాత్రం త‌న సినిమాని ఎట్టి ప‌రిస్థితుల్లో రిలీజ్ చేస్తాన‌ని చెబుతున్నారు. 
 
తాజా స‌మాచారం ఏంటంటే... ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనే అంటున్నారు. మ‌రి.. వ‌ర్మ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.