శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (17:56 IST)

లారెన్స్ , ఎస్‌జే సూర్య చిత్రం జిగర్ తండ డబుల్‌ ఎక్స్‌ ఎలా వుందంటే.. రివ్య్యూ

Jigar Tanda Double X
Jigar Tanda Double X
నటీనటులు: రాఘవ లారెన్స్ , ఎస్‌జే సూర్య, షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాష్, ఇళవరసు తదితరులు
సాంకేతికత... సినిమాటోగ్రఫీ: తిర్రు, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: కార్తేకేయన్ సంతానం, ఎస్ కతిరేసన్, అలంకార్ పాండియన్, దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
 
ఇద్దరు నటులు, దర్శకులు  లారెన్స్, ఎస్‌జే సూర్య కలిసి నటించిన సినిమా జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌. తమిళంలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం
 
కథ : 
ఇది ఫక్తు తమిళ నేటివిటీ సినిమా. తెలుగులో కాబట్టి ఇక్కడ పేర్లు పెట్టారు. రాఘవ లారెన్స్ (అలియాస్ సీజర్) కర్నూలులో ఓ రౌడీ. ఓ రాజకీయ నాయకుడికి అనుచరుడు. పోటీ రౌడీ ఏకంగా సినిమా హీరో అయి పేరు తెచ్చుకుంటే సీజర్ తన గణంతో గలాటా చేస్తాడు. తన రౌడీ సామ్రాజ్యం పేరు జిగర్ తండ. ఇదిలా వుండగా, ఎస్‌జే సూర్య (రే దాసన్) పోలీస్ కావాలని కలలు కంటూ అనుకోకుండా ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు.
 
అలా అరెస్ట్ అయిన ముగ్గురికి, ఫారెస్ట్ లో ఏనుగుల దొంగను పట్టుకునేందుకు డ్యూటీ చేస్తున్న డి.ఎస్.పి. నవీన్ చంద్ర, వారికి సీక్రెట్ ఆపరేషణ్ ఇస్తాడు. అందులో భాగంగా ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్ ను చంపాలి. అందుకు ప్లాన్ చేసి, సీజర్ దగ్గరకు 'సినిమా దర్శకుడిగా సూర్య వెళతాడు. అతని చంపేక్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి? అవి ఏమిటి? సీజర్ తో సూర్య సినిమా తీశాడా? లేదా? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవించాయి. అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.స
 
సమీక్ష..
ఈ కథ 1975 నాటి కథగా తీసుకున్నాడు దర్శకుడు. అప్పటి వాతావరణాన్ని బట్టి బెల్ బాటమ్ ఫాంట్లు, వస్త్రధారణ, పట్టణం, థియేటర్, బిల్డింగులు చూపించాడు. హీరోల గెటప్స్ బాగున్నాయి. ఈ కథ పట్టణం నుంచి అటవీ ప్రాంతానికి వెళుతుంది. అక్కడ ట్రైబల్ ప్రజలను రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం కూలీకి పనిచేసే పోలీసు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారనేది ఇంట్రెస్ట్ గా వుంది. ఇంతకుముందు సంతానం చేసిన విడుదలైలో ఓ కోణం చూపిస్తే ఇందులో పూర్తిగా చూపించాడు.
 
జిగర్ తండ గ్యాంగ్ లీడర్ లారెన్స్ చాలా కేర్ లెస్ గా మానవత్వం లేని విధంగా నటించాడు. హాలీవుడ్ నటుడు క్లయింట్ వుడ్ స్ఫూర్తి తో హీరో ఆవాలనుకునే లా మేనరిజం బాగుంది. ఆ తర్వాత తను పదిమంది బాగు కోసం ఏమి చేశాడనే కోణంలోనూ రెండు షేడ్స్ కనిపిస్తాయి. దానికి తగ్గట్టలు సూర్య పాత్ర వుంటుంది. సినిమాలో ట్రైబల్ నావెల్టీ కూడా బాగుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా రాఘవ లారెన్స్ సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది.
 
నవీన్ చంద్ర కరడు కట్టిన పోలీసు అధికారిగా మెప్పించాడు. సత్యన్, అరవింద్ ఆకాష్ అలాగే మిగిలిన నటీనటులు బాగా నటించారు. ఈ చిత్రంలోని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ బాగుంది. అడవిలో ఏనుగులను చంపే విధానం, అందుకు ఏనుగు దొంగ అనుసరించే తీరులో ఆ నటుడు అద్భుతంగా నటించాడు. 
 
ఇటుేవంటి కథను చూడగానే ఇది యూనివర్సల్ కథగా అనిపిస్తుంది. గతంలో వీరప్పన్ కథ కూడా ఇలాంటిదే. అతన్ని పెంచి పోషించి అటవీ సంపదను దెోచుకునే నాయకులు, మహిళా  సి.ఎం. ఏ విధంగా కుట్రలు పన్నారనేది చాలా కూలంకషంగా దర్శకుడు చూపించాడు. యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి.
 
అయితే సినిమా అనే మాధ్యమం వల్ల గత చరిత్రను తెలుసుకునేందుకు ఏ విధంగా ఉపయోగపడిందనేది దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలిచాడు.  
 
ఫస్ట్ హాఫ్ లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల  సాగదీసినట్లుగా వుంది. సెకండ్ హాఫ్ మొదటి ముప్పై నిముషాలలో వచ్చే సీన్లు సినిమాకు కీలకం. రొటీన్ వచ్చే చాలా సినిమాలకంటే ఈ సినిమా చాలా బెటర్ గా వుంది.  
 
 దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు టేకింగ్ బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. తిర్రు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
 
ఈమధ్య పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయి. అందులో జిగర్ తండ ఒకటి.  కొన్ని ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే రాఘవ లారెన్స్ – ఎస్.జె .సూర్య నటన సినిమాకి ప్లస్ అయ్యాయి.  అక్కడక్కడా చిన్న లోపాలున్నా వర్తమాన భారతదేశ రాజకీయ ముఖచిత్రం ఇందులో కనిపిస్తుంది. అడవిని నమ్ముకుని బతికే బడుగు జీవులను అవసరమైతే చంపేయండని.. ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తే.... కుప్పలుగా చంపేసే సీన్..హైలెట్.  పాలకులు ఎందుకిలా? అని . లారెన్స్ అడిగే ప్రశ్న.. తను హీరోగా నటించిన సినిమా టైటిల్ పెట్టి ముగించాడు.
కొసమెరుపు.. 
చివరిలో లారెన్స్ కొడుకు పుడితే వాడిని చంపేయడానికి కొందరు ప్రయత్నిస్తే.. త్రిబుల్ ఎక్స్.. అంటూ ముగింపు కార్డ్ ఇచ్చాడు దర్శకుడు.