గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (16:29 IST)

పెళ్లికి రమ్మన్న అమ్మాయి.. బీహార్ పెళ్లి చూద్దామన్న సోనూ సూద్

కరోనా కాలంలో పేదల పట్ల ఆపద్భాంధవుడుగా మారాడు నటుడు సోనూసూద్. అడిగినవారికి కాదనకుండా సాయం చేసిన సోనూసూద్‌కు లేటెస్ట్‌గా ట్విట్టర్‌లో పెళ్లికి ఓ ఆహ్వానం అందింది. బీహార్‌కు చెందిన నేహా అనే అమ్మాయి సోను సూద్‌ను వివాహనికి ఆహ్వానించగా.. పెళ్లికి వస్తానంటూ ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.
 
వివరాల్లోకి వెళితే.. పెళ్లి ఆహ్వాన లేఖను బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని నవాడా ప్రాంతానికి చెందిన కర్మన్ తోలాలో నివసిస్తున్న నేహా సహై పంపారు. నేహా సోదరి దివ్యకు కడుపు నొప్పి శస్త్రచికిత్స చేయించేందుకు సోనూ సహాయం చేశారు. ఈ క్రమంలోనే సోను సూద్‌కు ట్విట్టర్‌లో ఒక వివాహానికి రావాలని ఆహ్వానం పంపారు నేహా. సోనుసూద్ పెళ్లికి వెళ్ళడానికి అంగీకరించారు. 
 
'క్షమించండి సర్.. ఎక్సైట్మెంట్‌లో మీ పేరు రాయడం నేను మరచిపోయాను. మీరు పెళ్లికి వస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను మీ కోసం వేచి ఉంటాను' అని సోను సూద్‌ను ట్యాగ్ చేస్తూ నేహా ట్వీట్‌ చేశారు. నేహా ట్వీట్‌పై సోను సూద్ స్పందించారు. 'బీహార్ పెళ్లి చూద్దాం' అంటూ సమాధానం ఇచ్చారు.