లైగర్` ముంబైలో ల్యాండ్ అయింది
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం `లైగర్`. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన బాక్సింగ్ స్టిల్‌ను బయటకు విడుదల చేశారు. శనివారంనాడు లైగర్ ముంబైలో ల్యాండ్ అయిందంటూ విజయ్‌దేవరకొండ ఫొటోలను ఛార్మికౌర్ పోస్టు చేసింది. ఫ్లయిట్‌లో కూర్చుని స్నాక్స్ తింటున్న మూడు ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది.
ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. `సాలా క్రాస్‌బ్రీడ్` అనేది కాప్షన్. అందులోని చిత్ర కథంతా వుందని త్వరలో ఆ వివరాలు తెలియజేస్తామని అంటోంది. ఇప్పటికే సెప్టెంబర్ 9 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతోంది.
ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండ స్టిల్‌కు వచ్చిన రెస్పాన్స్ టెర్రిఫిక్. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, లావిష్‌గా ప్యాన్ ఇండియా లెవల్‌లో లైగర్‌ను పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌తో నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి విష్ణుశర్మ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.