శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 2 జులై 2018 (13:20 IST)

బిగ్ బాస్ ఇంట్లో ప్రేమ కథలు... రెండు జంటల పైన ఫోకస్...

బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్‌ ఉన్నంత ఆసక్తిగా రెండో సీజన్‌ లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రేక్షకుల మదిలో స్థిరపడిపోయింది. ఎలాగైనా ఈ షోకు హైప్‌ పెంచాలని నిర్వాహకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రేమకథలను సృష్టించి ప్రచారం మొదలుపెట్టారు. ఇంట్లో ఉంటు

బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్‌ ఉన్నంత ఆసక్తిగా రెండో సీజన్‌ లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రేక్షకుల మదిలో స్థిరపడిపోయింది. ఎలాగైనా ఈ షోకు హైప్‌ పెంచాలని నిర్వాహకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రేమకథలను సృష్టించి ప్రచారం మొదలుపెట్టారు. ఇంట్లో ఉంటున్న తనిష్‌-సునయన; సామ్రాట్‌-తేజస్వీ మధ్య ఏదో నడుస్తున్నట్టు ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తించింది. 
 
ఆవిధంగా ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు జంటల మధ్య ప్రేమ చిగురించినట్లు గతవారం ఇంట్లోని సభ్యులతో సూచనప్రాయంగా మాట్లాడించారు. శనివారం ఎపిసోడ్‌కు వచ్చిన హోస్ట్‌ నాని కూడా ఆ రెండు జంటలు ప్రేమలో ఉన్నాయన్న అనుమానం ప్రేక్షకులకు కలిగేలా మాట్లాడారు.
 
తేజస్వినితో మాట్లాడుతున్నప్పుడు…. ఇంకా… ఇంకా… ఇంకా… ఇంకా… అంటుంటే కెమెరా సామ్రాట్‌ను చూపించిది. సామ్రాట్‌తో మాట్లాడేటప్పుడు తేజస్వీని పదేపదే చూపించారు. తనిష్‌-సునయన విషయంలోనూ ఇలాగే చేశారు. నాని ఎంతగా ప్రయత్నించినా… ప్రేమ అనే మాటను ఆ నలుగురిలో ఒక్కరితోనూ చెప్పించలేకపోయారు. మొదటి సీజన్‌లోనూ చివరిదాకా ఇటువంటి ప్రేమకథనే ఒకటి ప్రచారం చూస్తూ ప్రేక్షకులను రంజింపచేశారు. ఈసారి రెండు జంటలకు ప్రేమ ముద్ర వేసి… షోను ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఇలాంటి జంటలు చివరిదాకా షోలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఇదిలావుండగా శనివారం నాటి ఎపిసోడ్‌లో డప్పుతో దండోరా వేస్తూ ఒక ఇంటి సభ్యుని గుణగణాలు చెప్పే కాన్పెప్ట్‌ తీసుకున్నారు. రక్తి కట్టించడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్‌ అయినప్పటికీ…. ఏ ఒక్కరూ సరిగా చేయలేకపోయారు. దండోరా వేయమంటే… ఒకరు హరికథ రీతిలో చెబితే, ఇంకొకరు సోది రూపంలో చెప్పారు. ఏ కళారూపాన్నీ ఆకట్టుకునేలా ప్రదర్శించలేకపోయారు. గత సీజన్‌లో హరితేజ హరికథను ఇరగదీసిన సంగతి తెలిసిందే. అటువంటిది కంటెంట్‌ తీసుకురావాలని ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకుంది. మరి ప్రేమకథలను ప్రేక్షకులు ఏ మేరకు స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే.