శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:23 IST)

సాయిపల్లవి క్రేజ్.. 'లవ్ స్టోరీ' మూడు భాషల్లో రిలీజ్ అవుతుందా?

ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన శేఖర్ కమ్ముల తాజాగా లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించనున్నారు. నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే రిలీజైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా లవ్ స్టోరీ చిత్రం తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ రిలీజ్ అవనుందట. కన్నడ, మళయాలంలోనూ తెలుగుతో సహా రిలీజ్ అవనుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
 
లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. సాయి పల్లవి మలయాళం సినిమాతోనే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. ఇప్పుడు తెలుగు సినిమా మలయాళంలో రిలీజ్ అవడం నిర్మాతలకి కలిసొచ్చే అంశమే. ఇటు కన్నడలో, తమిళంలోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ వుంది. దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో లవ్ స్టోరీని విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.