శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (19:55 IST)

'మా' ఎన్నికల్లో తొలి ఫలితం: ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు

'మా' ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఇద్దరు గెలుపొందారు. 'మా కార్యకర్గ సభ్యులుగా పోటీపడిన శివారెడ్డి, కౌశిక్‌లు విజేతలుగా నిలిచారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అంతేకాదు, వారి సంతోషం ఇనుమడింపజేసేలా అనసూయ, సురేశ్ కొండేటి ఓట్ల లెక్కింపులో ముందంజలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారే.
 
మా ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైనట్టు తెలుస్తోంది. ఇందులో మంచు విష్ణు ప్యానెల్ కు మెజార్టీ వచ్చినట్టు సమాచారం. విష్ణు ప్యానెల్ లో 10 మంది ఈసీ మెంబర్లు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో 8 మంది ఈసీ మెంబర్లు ఆధిక్యంలో ఉన్నట్టు తెలిసింది. కాసేపట్లో తొలి ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలైన ఓట్లలో 50 చెల్లని ఓట్లను గుర్తించినట్టు సమాచారం