శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (12:14 IST)

'మా' సభ్యత్వానికి రాజీనామా: ప్రకాష్ రాజ్

తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. తాను ఇక ఇక్కడ అతిధిగానే ఉంటానని చెప్పారు. తనకు మాతో 21 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఫలితాలను బట్టి తనను నాన్ లోకల్‌గా గుర్తించారని ప్రకాష్ రాజ్ చెప్పారు. 
 
నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. కానీ అది నేను చేసిన తప్పు కాదు కదా? అని ఆయన ప్రశ్నించారు. తాను ఇకపై అతిధిగానే కొనసాగుతానని చెప్పారు. తనపై ప్రాంతీయ వాదం, జాతీయవాదాన్ని రుద్దడం బాధించిందని ప్రకాష్ రాజ్ చెప్పారు.
 
నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపోందారు. ఈ ఎన్నికల నేపథ్యంలో అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు, ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఒకిరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఓ దశలో ఈ ఎన్నికల హడావిడి ఎలా మారిందంటే.. కనీసం వేయ్యి ఓట్లు లేని ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. 
 
ఇక ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్‌గా ఓడిపోవడంతో ఆయన​ ప్యానెల్​కు మద్దతు తెలిపిన నటుడు, మెగా బ్రదర్​ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.