ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (14:50 IST)

గుంటూరులో మాచర్ల నియోజకవర్గం ఫంక్ష‌న్‌- నేడు మాచర్ల యాక్షన్ ధమ్కీ విడుదల

Machrla dhamky
Machrla dhamky
నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ క్యురియాసిటీని పెంచుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ దూకుడు పెంచిన చిత్ర యూనిట్ మాచర్ల యాక్షన్ ధమ్కీని రిలీజ్ చేసింది.
 
పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన అన్ని పాజిటివ్‌ ఎలిమెంట్స్ చూపించే ట్రెమండస్ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిన్న కట్‌లో అద్భుతంగా చూపించారు. మాచర్ల యాక్షన్ ధమ్కీలో అదిరిపోయే డైలాగ్, అద్భుతమైన యాక్షన్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించాయి.  
 
'మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాధులుగా వేశారు.. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి... నేను సిద్ధం'అని నితిన్ చెప్పిన డైలాగ్ హీరో పాత్రని ఎస్టాబ్లెస్ చేయడమే కాకుండా సినిమాపై మరింత క్యూరీయాసిటీని పెంచింది.  
 
యాక్షన్ ధమ్కీ సృష్టించిన మాస్ మానియా నుండి ప్రేక్షకులు బయటకు రాకముందే.. ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్‌లో 'మాచర్ల నియోజకవర్గం'  థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేస్తోంది.
 
మాచర్ల నియోజకవర్గంను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
 
కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేయనుంది.  
 
మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మామిడాల తిరుపతి డైలాగ్స్,  సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.   మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల  
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్