బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (17:36 IST)

వినోదం కోసం మ్యాడ్ మ్యాక్స్ స్క్వేర్ రాబోతుంది

Mad Max square poster
Mad Max square poster
యూత్ ను బాగా అలరించి నటుడిగా నార్నే నితిన్ ను నిలబెట్టిన సినిమా మ్యాడ్. ఇందులో పలువురు నటీనటులకు గుర్తింపు వచ్చింది. సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజా ఈ సినిమా కొనసాగింపుగా మ్యాడ్ మ్యాక్స్ స్క్వేర్  సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ రేపు సింగిల్ తో చిత్ర యూనిట్ తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. 
 
వినోదం కోసం సిద్ధంగా ఉండండి అంటూ తెలియజేస్తూ ఇది మరింత అందరినీ అలరిస్తుందని చెబుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బేనర్ లో నాగవంశీ, హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా భీమ్స్ సిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.