సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:16 IST)

కరోనాపై మాధవీ లతా వీడియో వైరల్... కరోనాకు రాజు, పేద తేడా లేదు

'టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లతా కరోనాపై చేసిన టిక్ టాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
''మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి'' అంటూ ఆమె చెప్పిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కరోనాకు రాజు, పేద తేడా తెలియదని మాధవీ లతా చెప్పింది.  
 
ఈ వీడియోకు షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్‌ చేశారు. ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు.. చాలా బాగా చెప్పాల్సింది చెప్పేశారని నెటిజన్లు మాధవీలత వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు.