అమలాపాల్‌కు ఊరట.. భవ్‌నిందర్‌ సింగ్‌కు ఉత్తర్వులు.. ఆ ఫోటోలు షేర్ చేయొద్దు..

Amala Paul
Amala paul
సెల్వి| Last Updated: శుక్రవారం, 20 నవంబరు 2020 (18:10 IST)
హీరోయిన్ అమలాపాల్‌కు మద్రాసు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమె మాజీ ప్రియుడు, గాయకుడు భవ్‌నిందర్‌ సింగ్‌‌కు అమలాపాల్‌తో దిగిన వ్యక్తిగత ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇటీవల అమలాపాల్‌ భవ్‌నిందర్‌పై పరువునష్టం దావావేశారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని భవ్‌నిందర్‌ను ఆదేశించింది. డిసెంబరు 22కు కేసును వాయిదా వేసింది.

భవ్‌నిందర్‌ తమ వ్యక్తిగత చిత్రాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, వివాహం జరిగినట్లు చిత్రీకరిస్తున్నాడంటూ ఇటీవల అమలాపాల్‌ కోర్టును ఆశ్రయించారు. అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకున్నారని మార్చిలో వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన గాయకుడు భవ్‌నిందర్‌తో ఆమె పెళ్లి జరిగిందంటూ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీటిపై అమలాపాల్‌ స్పందిస్తూ.. వృత్తిపరమైన అవసరాల కోసం ఆ ఫొటోలు దిగామని, అది పెళ్లి కాదని స్పష్టం చేసింది.దీనిపై మరింత చదవండి :