సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (20:04 IST)

మెగాస్టార్‌ని ఆక‌ట్టుకున్న‌ అర్జున్ సురవరం టీజర్...

నిఖిల్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రం మార్చి 29న విడుదలకు సిద్ధమవుతోంది. టి. సంతోష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజర్‌ను మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా రిలీజ్ చేసారు. కాసేపటికే ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్‌కుమార్ ఆకెళ్లకు మెగాస్టార్  నుంచి మెసేజ్ వచ్చింది. ఇంత‌కీ చిరు ఏమ‌ని మెసేజ్ చేసారంటే...“హాయ్ డియర్ ప్రొడ్యూసర్ (రాజ్). ఇప్పుడే అర్జున్ సురవరం (టీజర్) చూశాను. అది చాలా ఆసక్తికరంగా అనిపించింది. నీకూ, నిఖిల్‌కూ, డైరెక్టర్‌కీ ఆల్ ద వెరీ బెస్ట్” అని మెసేజ్ చేసారు.
 
ఈ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల ఎవరో కాదు. అనేక సంవత్సరాలుగా తెలుగు చిత్రసీమ వీడియో పైరసీపై చేస్తున్న పోరాటంలో యాక్టివ్‌గా పాలుపంచుకొంటూ, యాటీ పైరసీ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి. అందుకే చిత్రసీమలోని అందరికీ ఆయన సుపరిచితుడు. మెగాస్టార్ మెసేజ్ నిఖిల్‌కు తెలియ‌డంతో.. ఆనందంతో చిరంజీవి మెసేజ్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసాడు. అదీ..సంగ‌తి..!