ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:39 IST)

తండ్రీతనయులు నటించిన "మహాన్" ట్రైలర్ రిలీజ్

విలక్షణ నటుడు విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన చిత్రం "మహాన్". కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. తమిళంలో మహాన్ పేరు పెట్టగా, తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేయనున్నారు. నిజజీవితంలో తండ్రీతనయులైన విక్రమ్, ధృవ్ విక్రమ్‌లు ఈ చిత్రంలో కూడా తండ్రీ తనయులుగా నటించారు. 
 
దీంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. అయితే, వారి ఆశలను అడియాశలు అయ్యాయి. ఈ చిత్రాన్ని థియేటర్‌‍లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నెల 10వ తేదీన అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఇందులోభాగంగానే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో వాణీ భోజన్, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటించగా, బాబీ సింహా కీలక పాత్రను పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మాత లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.