సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 21 మే 2018 (17:08 IST)

సావిత్రిని చూసేందుకు జెమినీ గణేశన్ అప్పట్లో గోడదూకారు.. కానీ?: చాముండేశ్వరి

తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బంపర్ హిట్ అయిన అలనాటి తార సావిత్రి బయోపిక్ మహానటిపై జెమినీ గణేశన్ కుమార్తెలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్ప‌వ‌ల్లి, సావిత్రి, జూలియాలు భార్య‌లన

తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బంపర్ హిట్ అయిన అలనాటి తార సావిత్రి బయోపిక్ మహానటిపై జెమినీ గణేశన్ కుమార్తెలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్ప‌వ‌ల్లి, సావిత్రి, జూలియాలు భార్య‌లన్న సంగతి తెలిసిందే. న‌లుగురు భార్య‌ల‌ను క‌లిగిన జెమినీ గ‌ణేష‌న్‌కు మొత్తం ఏడుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
 
మొద‌టి భార్య అల‌మేలుకు డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవతి స్వామినాథన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్‌తో న‌లుగురు కూతుళ్లు, రెండో భార్య పుష్ప‌వ‌ల్లికి బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్ అనే ఇద్ద‌రు కూతుళ్లు, మూడో భార్య సావిత్రికి ఒక కూతురు విజయచాముండేశ్వరి, ఓ కొడుకు సతీష్ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో వీరందరూ ఒక్క త‌ల్లి బిడ్డ‌లు కాక‌పోయినా.. కనీసం ఏడాదికి ఒక్కసారైన త‌ప్ప‌కుండా క‌లుస్తార‌ట‌. తాజాగా గ‌త శుక్ర‌వారం ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు చెన్నైలో క‌లిశార‌ట. ఆ సంద‌ర్భంగా తీయించుకున్న ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే మహానటి సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను నెగటివ్‌‍గా చిత్రీకరించారని కమలా సెల్వరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ బాగా నటించిందని.. జెమినీ గణేశన్‌కు మహిళలంటే గౌరవం అని.. ఆయన వెంటే అమ్మాయిలు పడతారే కానీ.. ఆయన ఎవ్వరి వెంట పడరని చెప్పారు. సావిత్రి బయోపిక్‌లో జెమినీ గణేశన్‌ సావిత్రికి మద్యం అలవాటు చేసినట్లు గల సీన్స్‌పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మహానటిలో జెమినీ గణేశన్‌ను మహానటిలో నెగటివ్‌గా చూపించలేదని సావిత్రి కుమార్తె చాముండేశ్వరి అన్నారు. 
 
సావిత్రి, జెమినీ గణేశన్‌ల మధ్య సన్నివేశాల్లో చిన్న చిన్న అర్థాలను అద్భుతంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. మద్యం అలవాటు జెమినీ గణేశన్ చేసింది కాదని.. నటీనటులు గొప్ప హోదా వచ్చాక పార్టీలకు వెళితే పబ్లిక్‌గా డ్రింక్స్ చేస్తుంటారని.. అలా అమ్మగారికి ఆ అలవాటు వచ్చిందని.. జెమినీ గణేశన్ సంతానం, అక్క (కమలా సెల్వరాజ్)తో సంబంధాలను మహానటి కొనసాగిస్తుందే కానీ అభిప్రాయభేదాలను తెచ్చిపెట్టదని చాముండేశ్వరి  చెప్పారు. కమలా అక్క ఆ చిత్రాన్ని ఎలా అర్థం చేసుకుందో.. అడిగి తెలుసుకుంటానని.. ఆమెతో సంబంధాలను ఎప్పటికీ కొనసాగిస్తానని తెలిపారు.
 
సావిత్రి అమ్మగారిని చూసేందుకు.. ఆమెను ప్రొటెస్ట్ చేసేందుకు జెమినీ గణేశన్ గోడదూకి వచ్చారని.. అయితే సావిత్రి అమ్మగారి చుట్టూ వున్న చుట్టాలు రాబందుల్లా వారిని వేరు చేశారని.. అప్పట్లో శునకాలు అరవడంతో గోల గోల అయ్యివుండవచ్చునని చాముండేశ్వరి అన్నారు. 
 
సావిత్రి అమ్మగారికి నాన్నపట్ల లేనిపోని అపవాదులు బంధువులు నూరిపోశారని.. అందుకే అమ్మ నాన్న ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపడలేదని చాముండేశ్వరి తెలిపింది. అయినా గతాన్ని మరిచిపోయి.. పెద్దలు ఎలా వున్నా.. వారి సంతానం కలిసి మెలసి వుండాలనే ఏడాదికి ఒక్కసారైనా కలుసుకుంటామని చాముండేశ్వరి చెప్పింది. అందరూ ఒక తండ్రి బిడ్డలమని ఎప్పటికీ గుర్తించుకుంటామని చాముండేశ్వరి తెలిపారు.