బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (12:49 IST)

నయనతార డాక్యుమెంటరీపై మహేష్ బాబు, జాన్వీ కపూర్ రెస్పాన్స్ ఏంటి?

Nayanatara
Nayanatara
లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై తీసిన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.
 
నయన్ డాక్యుమెంటరీపై మహేష్ కామెంట్స్ ఏమీ చేయకపోయినా, లవ్ ఎమోజీల ద్వారా స్పందించారు. ఇక జాన్వీ కపూర్ కూడా ఈ డాక్యుమెంటరీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక పోస్ట్‌ చేశారు. డాక్యుమెంటరీలోని ఫోటో షేర్ చేసిన జాన్వీ.. బలమైన మహిళను మరింత శక్తిమంతంగా చూడటం కంటే స్ఫూర్తినిచ్చేది ఇంకేదీ లేదని క్యాప్షన్ పెట్టారు. దీనికి హార్ట్ సింబల్‌ను జోడించారు. 
 
ఇకపోతే.. నయనతార పుట్టినరోజు స్పెషల్‌గా ఆమె పెళ్లితో పాటు పర్సనల్ లైఫ్‌పై తీసిన "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. 
 
నయన్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ డాక్యుమెంటరీలో నయన్ జీవితం గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ వివాదంగా మారిన సంగతి తెలిసిందే.