Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డైలాగ్, సాంగ్, ఫైట్, రొమాన్స్ ఏదీ లేదు.. టీజర్ ఇలా కూడా తీస్తారా.. ప్రభంజనం సృష్టిస్తున్న స్పైడర్ టీజర్

హైదరాబాద్, శుక్రవారం, 2 జూన్ 2017 (06:35 IST)

Widgets Magazine

మహేష్, మురగదాస్ కాంబినేషన్లో తీస్తున్న స్పైడర్ అక్షరాలా ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజైన ఐదు గంటల్లోనే 20 లక్షల వ్యూస్‌తో పాటు, 1 లక్షా 20 వేల లైక్స్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌ ఆల్‌ టైమ్‌ రికార్డును ఈజీగా దక్కించేసుకుందని చిత్రబృందం పేర్కొంది. అయితే టీజర్ల చరిత్రలోనే సరికొత్త చరిత్రను స్పైడర్ టీజర్ నమోదు చేసింది. 
mahesh babu
 
డైలాగ్ లేకుండా, పాట లేకుండా, ఫైట్ లేకుండా, రొమాన్స్ లేకుండా ప్లాట్‌గా దూసుకొచ్చిన స్పైడర్ టీజర్ అభిమానులకు, చూస్తున్నవారికి షాక్ కలిగించింది. టీజర్‌ని ఇలా కూడా తీయవచ్చు అని చూపించిన స్పైడర్‌ని చూసి మహేష్ అభిమానులు ఫిదా అయిపోయారు. తెలుగు సినిమా స్టామినాను నిజంగా మరో ఎత్తుకు తీసుకుపోయే స్థాయిలో టీజర్ తయారైంది.
 
సింగిల్‌ డైలాగ్‌ చెప్పలేదు. ఒక్క సాంగ్‌ వినిపించలేదు. ఫైట్‌ సీన్‌ కనిపించలేదు. రొమాన్స్‌ లేదు. అయినా ‘స్పైడర్‌’ టీజర్‌ మాత్రం అదిరిపోయింది. సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌తో టీజర్‌ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు మహేశ్‌బాబు.  ఏఆర్‌ మురుగదాస్‌ డైరెక్షన్‌లో మహేశ్‌బాబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ‘స్పైడర్‌’ టీజర్‌ గురువారం విడుదలైంది.
 
రిలీజైన ఐదు గంటల్లోనే 20 లక్షల వ్యూస్‌తో పాటు, 1 లక్షా 20 వేల లైక్స్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌ ఆల్‌ టైమ్‌ రికార్డును ఈజీగా దక్కించేసుకుందని చిత్రబృందం పేర్కొంది. మెటల్‌ బాక్స్‌ రోబో స్పైడర్‌గా మారి, కంప్యూటర్‌ వర్క్‌లో లీనమైన మహేశ్‌ దగ్గరకు రావడం, దాన్ని చూసి, మహేశ్‌ ‘ష్‌’ అనగానే అది సైలెంట్‌ అయిపోవడం, అప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అంతా బాగుందని మహేశ్‌ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.
 
వచ్చేటప్పుడు ఆ రోబో స్పైడర్‌ మూమెంట్, డిజైన్‌ అండ్‌ లుక్‌ అన్నీ సూపర్‌గా ఉన్నాయంటున్నారు. ఈ చిత్రానికి హ్యరీస్‌ జైరాజ్‌ స్వరకర్త.  ప్రస్తుతం చెన్నైలో లాస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పైడర్‌’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి నా జీవితంలో ఒక భాగం కాదు.. నా జీవితమే బాహుబలి అంటున్న ప్రభాస్

గత ఐదేళ్లుగా బాహుబలి నా జీవితాన్ని ఆవహించినట్లు భావిస్తున్నాను తప్ప నా జీవితంలో బాహుబలి ...

news

నాగ్ నుంచి అఖిల్ దాకా.. ఆ కుటుంబంలో ఎవరినీ వదలని పొడుగాటి సుందరి

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మెరుపులా మెరిసి ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన పొడుగుకాళ్ల ...

news

మహేష్ బాబుకు రాజమౌళి ఫీవర్... జక్కన్నను కలిస్తే ఆ మాటన్నాడట...

మహేష్‌ బాబు చిన్నతనం నుంచి నటనలో తనదైన శైలిలో రాణిస్తున్న హీరో. యువ కథనాయకుల్లో మహేష్ ...

news

టాప్-100లో ఆ ఇద్దరు.. మోడీ ముందు ప్రియాంక లెగ్స్.. కేటీఆర్ ముందు జిల్ ఎలా కూర్చుందో చూడండి..

మాగ్జిమ్ అనే పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరనే దానిపై ...

Widgets Magazine