శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (09:22 IST)

"మహర్షి" ఫ్లెక్సీ కడుతూ మహేష్ బాబు అభిమాని

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి'. ఈ చిత్రం మే 9వ తేదీ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై అభిమాని మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. 
 
స్థానిక పారిశ్రామికవాడ కాలనీకి చెందిన యర్రంశెట్టి రాజీవ్‌ (27) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈయన మహేష్ బాబు తీవ్ర అభిమాని. అయితే మహర్షి చిత్రం విడుదలను పురస్కరించుకుని ఐరన్‌ ఫ్రేమ్‌తో కూడిన ఫ్లెక్సీ కట్టేందుకు మరో వ్యక్తితో కలసి.. మురళీకృష్ణ థియేటర్‌ పక్కన బిల్డింగ్‌పైకెక్కాడు. 
 
ఫ్లెక్సీ ఫ్రేమ్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైన రాజీవ్‌ ఒక్కసారిగా బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు.