మహేష్‌బాబుకు 23 ఏళ్ళు
నలభై ఏళ్ళు దాటిన మహేస్‌బాబుకు 23 ఏళ్ళు అనుకుంటున్నారా.. మరి చూస్తానికి అలానే వుంటాడు. అసలు మహేష్‌బాబు నటుడిగా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 23 ఏళ్ళయిందన్నమాట. 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా రాజకుమారుడు. 30 జులై, 1999న విడుదలైంది. ఇది మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది.
ఆ తర్వాత ఒక్కో సినిమాకు ఎత్తు పల్లాలు చూసిన మహేష్‌కు పోకిరి ఒక్కసారిగా మాస్ హీరోగా చేసేసింది. అటు క్లాస్ పీపుల్ కూడా మెచ్చారు. ఇక శ్రీమంతుడు వంటి సామాజిక అంశాన్ని కూడా చేసిన ఆయన సర్కారువారిపాటతో మరింత పేరు తెచ్చుకున్నారు. హిట్లు ప్లాప్‌లను సమానంగా చూసే మహేష్‌బాబుకు ఆయన అభిమానులు నేడు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే వెకేషన్‌కు విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన మహేష్ తాజాగా తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నాడు. ఆగస్టునుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.