ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (17:34 IST)

మహేష్ బాబు 'స్పైడర్' స్టామినా ఏంటో తెలిస్తే ఇక వాళ్లు కూడా ఆగరట...

టాలీవుడ్‌లో గతకొంత కాలంగా హీరోల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. సినిమాలు ప్రారంభం మొదలుకొని, పోస్టర్, టీజర్, ట్రయిలర్ విడుదల, ఆడియో విడుదల, సినిమా విడుదలయ్యే థియేటర్ల సంఖ్య, మొదటి రోజు కలెక్షన్‌ రికార్డులు, మొత్తం వసూళ్లు వంటి వాటిలో ప్రేక్షకులే క

టాలీవుడ్‌లో గతకొంత కాలంగా హీరోల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. సినిమాలు ప్రారంభం మొదలుకొని, పోస్టర్, టీజర్, ట్రయిలర్ విడుదల, ఆడియో విడుదల, సినిమా విడుదలయ్యే థియేటర్ల సంఖ్య, మొదటి రోజు కలెక్షన్‌ రికార్డులు, మొత్తం వసూళ్లు వంటి వాటిలో ప్రేక్షకులే కాదు, సాటి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధాలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. 
 
ఇప్పుడు చిరు ఫ్యామిలీలో పెద్ద హీరోలు రీమేక్ బాట పట్టడంతో వారు ఇలాంటి అంశాల్లో కాస్త వెనకబడినట్లు అనిపిస్తోంది. గత ఏడాది రామ్‌చరణ్ "ధృవ", ఈ సంవత్సరం చిరు "ఖైదీ నెం.150", పవన్ "కాటమరాయుడు" వంటి సినిమాలు తమిళ రీమేక్‌లుగా వచ్చాయి. తమిళంలో ముందుగానే వచ్చిన కారణంతో ఈ సినిమాలు అక్కడ మార్కెట్‍‌ను పెంచుకోలేకపోయాయి. 
 
కానీ ఇప్పుడు మహేష్ నటిస్తున్న 'స్పైడర్' సినిమా ఏకకాలంలో రెండు భాషలలో దసరాకు విడుదల కానుంది. ఇందులో మహేష్ తన సొంత స్వరాన్నే తమిళంలోనూ వినిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ అభిమానుల అంచనాలను పెంచాయి. మన తెలుగు హీరో ఇలా మన మార్కెట్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. ఈ సినిమా తమిళంలో హిట్టయ్యిందంటే, మరింతమంది మన హీరోలు ఇలా ఒకేసారి అక్కడా నటించేందుకు మొగ్గు చూపే అవకాశాలు ఏర్పడనున్నాయని మనకు ఇట్టే అర్థమౌతుంది.