శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (12:53 IST)

మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభం .. టిక్కెట్ ధర రూ.230

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఏఎంబీ పేరుతో నిర్మించిన ఈ థియేటర్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ గచ్చిబౌలి, కొండాపూర్ సమీపంలో మొత్తం 7 స్క్రీన్‌లతో మొత్తం 1,600 సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్లను నిర్మించారు. ఇందులో తొలి చిత్రంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2పాయింట్ ఓ చిత్రం ప్రదర్శితమైంది. 
 
అయితే, ఈ థియేటర్‌లో ఒక టిక్కెట్ ప్రారంభ ధర రూ.230గా నిర్ణయించారు. కాగా, వచ్చే నాలుగైదు రోజుల వరకూ దాదాపు అన్ని ఆటలూ హౌస్ ఫుల్ అయ్యాయి. 'బుక్ మై షో' ద్వారా టికెట్ల అమ్మకాలు సాగుతుండగా, ప్రతి ఆటకూ అతి తక్కువ సీట్లు మాత్రమే ఖాళీగా కనిపిస్తున్నాయి.
 
ఇక ఈ థియేటర్లను చూసిన వారు, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత లగ్జరీగా ఉన్నది ఇదేనంటూ కితాబిస్తున్నారు. రీక్లయినర్ సీట్లతో పాటు, పడుకుని చిత్రాన్ని వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం గమనార్హం. థియేటర్ నిర్మాణాన్ని మహేష్ సతీమణి నమ్రత దగ్గరుండా పర్యవేక్షించడం గమనార్హం.