బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (12:45 IST)

మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ మూవీస్‌లో సర్కారు వారి పాట టాప్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. 
 
మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా తెలుగులో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ మూవీస్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాది విషయానికొస్తే.. ఈ సినిమా మూడో ప్లేస్‌లో నిలిచింది.
 
అజిత్ హీరోగా నటిస్తోన్న 'వలిమై' ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది. విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' రెండో ప్లేస్‌లో నిలిచింది. మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూడో స్థానంలో నిలిచింది.
 
తెలుగు వరకు మాత్రం ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 1 నుంచి జూన్ 30వ తేది వరకు దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి ట్విట్టర్‌ విడుదల చేసిన జాబితాలో సర్కారు వారి పాట ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా మూడో స్థానంలో నిలిచింది.