శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (09:13 IST)

శమంతకమణిలో మహేష్ బాబు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు శమంతకమణిలో కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్‌ న్యూస్‌గా మారింది. యంగ్ హీరోలతో మల్టీ స్టారర్‌గా రూపొందించబడుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్ప

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు శమంతకమణిలో కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్‌ న్యూస్‌గా మారింది. యంగ్ హీరోలతో మల్టీ స్టారర్‌గా రూపొందించబడుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలోని సుధీర్ బాబు లుక్‌ను మహేష్ విడుదల చేశాడు. 
 
ఈ మూవీలో సుధీర్‌బాబుతో పాటు సందీప్ కిషన్ నారా రోహిత్ కీలక పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ పేరు వినబడుతోంది. అయితే మహేష్ ఈ చిత్రంలో నటించట్లేదని.. నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అతడికి మహేష్ బాబు పేరు పెట్టారని సమాచారం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మహేష్ అభిమానుల దృష్టిని ఈ సినిమా వైపు మరల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
బ్యాక్ యాంగిల్‌లో రాజేంద్రప్రసాద్ నుంచుని ఉన్న స్టిల్‌ను ఫస్ట్ లుక్ పోస్టర్‌గా మార్చి ఈ సినిమా టీజర్‌ను జూన్ 15న విడుదల చేయనున్నారు. మరి మహేష్ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని సుధీర్  విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మరి సినిమాకు ప్రిన్స్ మంత్రం ఏమేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.