సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (15:00 IST)

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

guntur kaaram pre release
మహష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇపుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే వేడుక తేదీ, ప్రాంతాన్ని ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన గుంటూరులో భారీ స్థాయిలో ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‍ను నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్లాన్ చేశారు. కానీ, పోలీసుల నుంచి అనుమతులు లభించకపోవడంతో 9వ తేదీకి వాయిదా వేశారు. 
 
గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన ఈ వేడుకను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభంకానుంది. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రం 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కాగా, ఆదివారం రాత్రి విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో మోత మోగిస్తుంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండున్నర కోట్ల వ్యూస్ సాధించింది.