మహేష్ అప్పుడు చబ్బీగా ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్‌లా ఉన్నాడు: రజనీకాంత్

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (12:12 IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ ఆడియో వేడుక చెన్నైలోని కలైవానర్ అరంగం ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు విశాల్ ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా, చిత్ర యూనిట్ అంతా వేడుక‌లో సంద‌డి చేసింది. స్పైడ‌ర్ చిత్రం ద్వారా మ‌హేష్ తొలిసారి త‌మిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ మాట్లాడుతూ.. తమిళంలో తొలి సినిమా చేశానని తెలిపాడు. మురుగ‌దాస్ సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్ప‌టినుంటో ఆయ‌నతో పని చేయాల‌నుకున్నాను. స్పైడ‌ర్‌తో అది తీరింది. ఈ చిత్రాన్ని మురుగ‌దాస్ అద్భుతంగా తెర‌కెక్కించార‌ని కొనియాడాడు. 
 
ఇక లైకా ప్రొడ‌క్ష‌న్స్ రాజు మ‌హ‌లింగం మాట్లాడుతూ.. రజనీకాంత్‌గారికి ఇన్విటేషన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు మహేష్ బాబును చూసి ఎంతబావున్నాడు. చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్‌లా ఉన్నాడని.. లుక్ అదిరిందని రజనీ మెచ్చుకోవడం చూసి థ్రిల్ అయ్యానని రాజు మహలింగం తెలిపాడు. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌, ర‌కుల్‌, ఎస్‌జె సూర్య ప్ర‌ధాన పాత్ర ధారులుగా నటించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.
 
ఇకపోతే స్పైడర్ ఆడియో వేడుకలో తెలుగు, త‌మిళ భాష‌ల‌కి సంబంధించిన పాట‌ల‌ను విడుద‌ల చేశారు. మ‌హేష్‌, మురుగ‌దాస్, విశాల్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. ఇక స్పైడ‌ర్ చిత్ర హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్, మ‌హేష్ బాబు ఫ్యాన్‌తో క‌లిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. సిసిలియా సాంగ్‌కి ర‌కుల్ లైవ్‌లో వేసిన స్టెప్పులు మ‌హేష్ అభిమానుల‌కి అమితానందాన్ని క‌లిగించాయి.దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Spyder Shankar Spyderaudioday Mahesh Babu Ss Rajamouli Spyder Audio Mahesh Babu Trends

Loading comments ...

తెలుగు సినిమా

news

బుల్లితెరపై కనిపించనున్న రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. ...

news

పవన్ కల్యాణ్‌కు ''హాఫ్ నాలెడ్జ్'' అన్న మహేష్ కత్తి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్

సినీన‌టుడు, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై‌‍ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి వివాదాస్పద ...

news

నువ్వు చూపిస్తేనే నీకు ఛాన్స్ - బొద్దుగుమ్మకు డైరెక్టర్ల సలహా...

అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టింది మలయాళ భామ నిత్యామీనన్. ...

news

సాహోలో శ్రద్ధా కపూర్ డుయల్ రోల్..? నిజమేనా?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో షూటింగ్ శరవేగంగా ...