బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (19:27 IST)

మమ్ముట్టి, జయరాం టీమ్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్

Mammootty, Jayaram team
Mammootty, Jayaram team
అందం ఎన్నా, సొందం ఎన్న.. అనే జేసుదాస్ పాటకు మలయాళ స్టార్లు డాన్స్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మమ్ముట్టి, జయరాం ఇతర టీమ్ కలిసి ఓ ఫంక్షన్ లో డాన్స్ వేస్తూ, చిన్న పిల్లల్లా నోటిలో వేసువేసుకుని డాన్స్ వేస్తూ లీనమై పోయారు. ఎదురుగా కూర్చున్న మోహన్ లాల్ తో ఇతర సభ్యులతో చేతులు కలుపుతూ ఎంటర్ టైన్ చేశారు. ఓ పెండ్లి కార్యక్రమంలో ఇలా జరిగిందని తెలుస్తోంది.
 
నిన్ననే మమ్ముట్టి నటించిన యాత్ర సీక్వెల్ కూడా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుతుంది. యాద్రుచికంగా ఈ డాన్స్ ఈరోజే సోషల్ మీడియాలో రావడం కూడా చిత్రంగా వుంది. వీడియోలో  మోహన్ లాల్ ని డ్యాన్స్ చేయడానికి మమ్ముట్టి ఆహ్వానించడంతో వారి డ్యాన్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. సినిమాలలోనే కాదు బయట కూడా మమ్ముట్టి సరదాగా వుంటారని కోలీవుడ్ అభిమానులు తెలియజేస్తున్నారు.