గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (13:35 IST)

షారూఖ్ ఖాన్ బంగ్లాను పేల్చేస్తానన్నాడు.. అరెస్టయ్యాడు...

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బంగ్లా మన్నత్‌ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివసిస్తున్న జితేష్ ఠాకూర్ అనే వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
 
2022 జనవరి 6న జితేష్ ఠాకూర్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. ఆ కాల్‌లో షారుక్ బంగ్లాతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. 
 
ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కాల్ చేసిన జితేష్ ఠాకూర్ మద్యానికి బానిసై ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.