మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (04:49 IST)

హీరోయిన్‌గా ఉన్నానంటే కారణం ఆ గురువే.. తాను తీసిన సినిమాపై కామెంట్ చేస్తానా: తాప్సీ

ఇవ్వాళ తాను హీరోయిన్‌గా టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్ లోనూ కొనసాగుతున్నానంటే దానికి కారణం మంచులక్ష్మీయేనని, సినీరంగం అంటే ఓనమాలు కూడా తెలియని రోజున ఆమెతనకు అన్నీ నేర్పించిందని, తనకు సంబంధించి స్నేహితురాలూ,

ఇవ్వాళ తాను హీరోయిన్‌గా టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్ లోనూ కొనసాగుతున్నానంటే దానికి కారణం మంచులక్ష్మీయేనని, సినీరంగం అంటే ఓనమాలు కూడా తెలియని రోజున ఆమెతనకు అన్నీ నేర్పించిందని, తనకు సంబంధించి స్నేహితురాలూ, గురువు అన్నీ తానేనని ఢిల్లీ భామ తాప్సీ పేర్కొంది. ప్రస్తుతం ఆనందోబ్రహ్మ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. 
 
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ డాల్ తాప్సీ. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాతో మోడల్‌గా ఉన్న తాప్సీ హీరోయిన్‌గా మారింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా తాప్సీకి మరెన్నో అవకాశాలు దక్కేలా చేసింది. ఆ సినిమా ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన తనకు సినీ రంగం గురించి అప్పటివరకు ఏమీ తెలీదని, ఆ సమయంలో మంచు లక్ష్మి తనకు చాలా విషయాలు నేర్పిందని తాజాగా తాప్సీ చెప్పింది. తాప్సీ చెప్పిన విశేషాలు.. ఆమె మాటల్లోనే..
 
‘‘మంచు లక్ష్మి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. మొదట్లో ఆమెతో మాట్లాడ్డానికి భయపడ్డాను. ఎందుకంటే అప్పటివరకు నాకు సినీరంగం గురించి ఏమీ తెలీదు. మామూలు కాలేజీ అమ్మాయిలా ఉన్నాను. ఆ సమయంలో మంచు లక్ష్మి నాకు ఎన్నో విషయాలు నేర్పింది. సినీ రంగం అంటే ఏంటి అందులో నా జాబ్ ఏంటి ఎలా రెడీ అవ్వాలి షూటింగ్ ఎలా జరుగుతుంది అనే విషయాలను నాకు వివరించింది. ఆమె నా స్నేహితురాలే కాదు.. నా గురువు కూడా. ఇప్పుడు కూడా నేను ఇంత క్రమశిక్షణతో సినిమాలు చేస్తున్నానంటే అదంతా ఆమె వల్లే.’’ అని మంచు లక్ష్మితో తన అనుబంధాన్ని బయటపెట్టింది తాప్సీ.
 
అలాగే ఝుమ్మంది నాదం సినిమాలో తనపై తీసిన సన్నివేశం గురించి బాలీవుడ్‌లో చేసిన ఒక షో తీవ్ర వివాదాస్పదం కావడంపై కూడా తాప్సీ ఇటీవలే వివరణ ఇచ్చింది. ఆ షో మొత్తం తనమీదే సెటైర్స్ వేసుకుంటూ ఫన్ జెనరేట్ చెయ్యాలని, అది ఆ షో కాన్సెప్ట్ అని, అందులో భాగంగానే తన బొడ్డు బాగలేకపోవడం వల్లే డైరెక్టర్ పూలు, పళ్లకు బదులు కొబ్బరి చిప్ప వేశారని చెప్పానని, దాన్ని అందరూ అపార్థం చేసుకున్నారని తాప్సీ చెప్పుకొచ్చింది. ఆ షో పూర్తి వీడియో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని చెప్పింది. 
 
తాను ఏ తప్పు చేయలేదని, అయినా తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధ పడుంటే క్షమించాలంటూ ఇటీవల తాప్సీ ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.