గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (20:22 IST)

భూమా మౌనిక రెడ్డికి మంచు మనోజ్.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడా? (video)

manchu manoj
మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి వినాయకుడికి పూజలు చేయడం.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఇక మౌనిక రెడ్డి కూడా సేమ్ టు సేమ్. 
 
గతంలో ఆమె కూడా పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయింది. 2015 లో మౌనిక రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే మౌనిక మొదటి పెళ్ళికి మంచు మనోజ్ కూడా హాజరయ్యాడు. మౌనిక మొదటి పెళ్లికి అతిథిగా వెళ్లిన మంచు మనోజ్ ఇప్పుడు ఆమెనే రెండో పెళ్లి చేసుకోబోతుండడం, ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.