బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (18:45 IST)

మంచు సోదరుల గొడవలు సద్దుమణిగాయి.. ట్వీట్ వైరల్

manchu vishnu
మంచు ఫ్యామిలీ డ్రామా సద్దుమణిగింది. అన్నదమ్ముల మధ్య గొడవలు మీడియాలో పెనుదుమారం రేపిన నేపథ్యంలో.. తామిద్దరి గొడవలు సాధారణమని, మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. అన్న విష్ణు తీరుపై మనోజ్ శుక్రవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 
 
అయితే ఈ వ్యవహారంపై మోహన్ బాబు స్పందించడంతో.. మనోజ్ పోస్టు చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. 
 
"బతకండి.. బతకనివ్వండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా" అని ట్వీట్ చేశారు. కొటేషన్స్ ఉన్న మరో రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ తర్వాతి రోజే మనోజ్ చేసిన ట్వీట్‌తో సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.