శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 2 మే 2019 (21:47 IST)

మంచు విష్ణు... బహుశా ఏపీ సీఎం చెప్పిన ఫార్ములా ఫాలో అవుతున్నారేమో?

సినీ నటుడు మంచువిష్ణువు నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. మంచు వారింట్లో నాలుగో అతిథి రాబోతున్నాడు. నేను మళ్ళీ తండ్రి కాబోతున్నాను. నా భార్య వినీ గర్భవతి. త్వరలోనే శుభవార్త చెబుతాను. ఇప్పటికే అరి, వివి, అవ్రామ్ ముగ్గురు పిల్లలున్నారు. మరో లిటిల్ ఏంజల్ రాబోతుంది. నేను ఇది చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా అన్నాడు మంచు విష్ణు.
 
ఈమధ్య కాలంలో సినీనటులు తమకు సంతోషం కలిగినా, బాధ వచ్చినా అభిమానులతో పంచుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచు విష్ణు ట్విట్టర్లో తన పర్సనల్ విషయాలను షేర్ చేశాడు. ఇప్పటివరకు తమ్ముడు మంచు మనోజ్ మాత్రమే ట్విట్టర్లో అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. అన్న కూడా ట్విట్టర్ ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ట్విట్టర్లో చాలామంది అభిమానులు మంచు విష్ణును ఆటపట్టిస్తున్నారు. 
 
ప్రభుత్వం ఇప్పటికే ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు బిడ్డలు వద్దని చెబుతుంటే నాలుగో బిడ్డకు తండ్రి ఎలా అవుతానని సందేశాలు పంపిస్తున్నారు. మంచు విష్ణు మాత్రం ఆ విషయాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. బహుశా లేటెస్టుగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన ఫార్ములా ఫాలో అవుతున్నారేమోనని మరికొందరు అంటున్నారు.