Widgets Magazine

అయిదేళ్ల కుమారుడి సమక్షంలో ఇంత షాకింగ్ సెల్ఫీలు దిగాలా మందిరా.. ఖర్మ.. ఇవీ వైరలే..నట

హైదరాబాద్, మంగళవారం, 13 జూన్ 2017 (04:46 IST)

Widgets Magazine

ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన సీనియర్‌ నటి, మోడల్‌ మందిరా బేడీ చాలా కాలం తర్వాత హాట్‌హాట్‌ ఫొటోలతో అభిమానులకు స్వీట్‌ షాకిచ్చారు. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఆ ఒక్కో ఫొటోలు ఒక్కొక్కటీ 50 వేలు తగ్గకుండా లైక్స్‌తోపాటు వందలకొద్దీ షేర్స్‌ వచ్చాయి.
 
కొన్నాళ్లుగా మీడియాకు దూరమైపోయిన ఈ 45ఏళ్ల నటి.. ఒక్కసారే ఇలా సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భర్త రాజ్‌ కౌశల్‌, ఐదేళ్ల కొడుకుతో సహా మందిరా బేడి శ్రీలంకలో పర్యటించారు.
 
శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో తారాస్థాయికి చేరింది. ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్‌నెస్‌ రంగంలోనూ రాణించారు. గతంలోనూ తన భర్త, కొడుకుతో కలిసి మందిర దిన ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
 
కానీ తన అయిదేళ్ల కుమారుడిని పక్కన పెట్టుకుని ఇంత గ్లామర్ ఒలకపోయడం సభ్యతేనా అనే ఒక్క ట్వీట్ కూడా మందిర ఫొటోల మీద రాకపోవడం విశేషం. భర్త పక్కనుంటేనేమి. కుమారుడు పక్కన ఉంటేనేమీ.. అలా కనబడితే చాలు లైకులకు, షేర్‌లకు దిగిపోతున్న  కాలమిది .. ఏం చేస్తాం..
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విశాఖలోనే స్థిరపడతా.. ఆది సరసన నటిస్తున్నా.. జబర్దస్త్ రష్మి గౌతమ్

టీవీ యాంకర్ నుంచి సినిమా యాక్టర్ అయిన రష్మీ ప్రస్తుతం హిట్ సినిమాపై కన్నేసింది. ...

news

మల్లియలారా... మాలికలారా మౌనముగా వున్నారా... సినారె కలం నుంచి...(వీడియో)

సి. నారాయణ రెడ్డి. 3 వేల పాటలకు పైగా ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన ఓ సాహిత్య ప్రవాహం. ...

news

అమ్మడు ఏంటీ కుమ్ముడు... తమన్నాకు డీల్ నచ్చితే చాలట...

సినీ పరిశ్రమలో డబ్బులిస్తే చాలు ఎలాగైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ...

news

సాయి ధరమ్ తేజ్.. తప్పు కదా.. అలా చేయడమేంటి...

సాయి ధరమ్ తేజ్. యువ నటుడిగా సినిమాల్లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ మొదట్లో తెలుగు ప్రేక్షకులకు ...