బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (16:03 IST)

'పొన్నియిన్ సెల్వన్': The Cholas are coming వీడియో రిలీజ్

PS
PS
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో.. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' రెండు భాగాలుగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. పీఎస్-1 2022 సెప్టెంబర్ 30న తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 
విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్థిబన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ తారాగణంతో 1950వ దశకంలో సీరియల్‌గా వచ్చిన కల్కి పేరున్న తమిళ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 
 
10 వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడిన ఒక సాహస యాత్ర, పొన్నియిన్ సెల్వన్ చోళ సామ్రాజ్యంలో వర్గ అధికార పోరాటాలను ట్రాక్ చేస్తాడు, రాజ్యం యొక్క శత్రువులు ఉత్ప్రేరకాలుగా వ్యవహరిస్తారు. పొన్నియిన్ సెల్వన్ (కావేరి నది కుమారుడు) తరువాత రాజరాజ చోళుడుగా పిలువబడతాడు. ఇతను స్వర్ణయుగానికి నాంది పలికి భారత చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరిగా మారడానికి ముందు జరిగిందే ఈ కథ.
 
ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీని, తోట తారారాణిని ప్రొడక్షన్ డిజైనర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో స్టార్ టెక్నీషియన్స్‌ ఈ సినిమాలో భాగం అయ్యారు. తాజా ఈ చిత్రం నుంచి The Cholas are coming అనే పోస్టర్ వీడియో రూపంలో విడుదలైంది. దీనిని ఓ లుక్కేయండి.