చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్
మనీషా కోయిరాలా. బాలీవుడ్ సీనియర్ నటి. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన 'క్రిమినల్', 'బొంబాయి', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. ఆ తర్వాత కేన్సర్ వ్యాధి బారినపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధిబారి నుంచి కోలుకుంటున్న మనీషా... ఇపుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తోంది.
అయితే, తాను ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి గల కారణాలను ఆమె వివరించింది. మనిషి చనిపోతున్నాడని తెలిశాక.. జీవితం విలువ తెలిసిందని అంటున్నారు. ప్రశాంతమైన వాతావణం, జీవితం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు.
ఇందులోభాగంగా, మహాశివుడి దర్శనం కోసం ఇటీవల సంప్రదాయ వస్త్రాధారణంలో వారణాసి వెళ్లింది. అక్కడి మీడియాతో మాట్లడిన మనీషా.. బతికున్నంతకాలం ప్రజలందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. సంప్రదాయ వస్త్రధారణలో వారణాసి వెళ్లిన ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో ఆమె పోస్ట్ చేశారు. ఆమె కూడా పూర్తిగా కోలుకోవాలని ఫ్యాన్స్ కూడా రీట్వీట్ చేశారు.