ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (16:58 IST)

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Maruti family at Kalahasti
Maruti family at Kalahasti
దర్శకుడు మారుతీ తాజా సినిమా రాజా సాబ్. ప్రభాస్ తో సినిమా తెరకెక్కించాడు. కొన్ని కారణాలవల్ల షూటింగ్ గేప్ తో సాగుతూ వుంది. కానీ  ఏప్రిల్ 10 విడుదలచేస్తామని ముందు ప్రకటించారు. కానీ అనుకున్న తేదీకి రావడంలేదు. మరోవైపు నిర్మాతలు రెండు సినిమాలు మారుతీ రూపొందిస్తున్నారు. వీటికంటే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో బాగా ఒత్తడిగా వుంది. దానికోసం దేవుడ్ని శరణువేడుకుంటూ పలుదేవాలయాలను సందర్శిస్తూ ఫొటోలు షేర్ చేశారు.
 
Martuthi at temple
Martuthi at temple
ఇదిలా వుండగా, సినిమాపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి అప్ డేట్ ఇంతవరకు రాలేదు. దానితో ఫ్యాన్స్ కూడా అసలు సినిమా పూర్తయిందా? లేదా? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ మారుతీని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. దానితో మారుతి వాటిపై స్పందించి తన శైలిలో సమాధానం ఇచ్చి అభిమానుల్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు.
 
‘సినిమా లేట్ అవుతున్నందుకు ఇబ్బంది ఏమీ లేదు. మీకు కావాల్సిన టైం తీసుకోండి. కానీ ఈ ఏడాది వస్తుందో లేదో చెప్పండి. అప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని బాధ పెట్టరు’ అంటూ ఒక నెటిజెన్ మారుతిని ప్రశ్నించాడు. ఇందుకు మారుతి.. ” ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  అదే పనిలో ఉంది. ‘సీజీ’ ఔట్పుట్ త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మొత్తం నా ఒక్కడి చేతిలోనే లేదు. దయచేసి ఓపిక పట్టండిఅంటూ ట్వీట్ లు చేస్తున్నాడు. 
 
ఫైనల్ గా షూటింగ్ గురించి చెబుతూ, కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే సాంగ్స్ పిక్చరైజ్ చేయాలి అంటూ మారుతీ సమాధానమిచ్చారు. అందుకే అవికూడా త్వరగా దేవుడి ఆశీస్సులుంటే జరుగుతాయని ఈరోజు తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు.